సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో నేడు, గురువారం మాట్లాడుతూ.. ఏపీలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తుశుద్దితో పాలన అందిస్తున్నారని, 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారని అన్నారు. వైసీపీ కి ప్రజలలో ఉన్న ఆదరణ తెలిసే టీడీపీ కి ఒంటరిగా ఎన్నికలలో పోరాడే దుమ్ము లేక పొత్తుల కోసం వెంపర్లాడు తుందన్నారు. అసలు రాష్టంలో 175 సీట్లులో పోటీ చేసే దమ్ము చం ద్రబాబుకు ఉందా? ఏం చేసినా అధికారం లోకి రాలేరని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే రంకెలేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్ ఢిల్లీ టూరు వేసి బీజేపీ తో టీడీపీ పొత్తు కలపడానికి ప్రయత్నం చేసారు. అసలు చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ పార్టీ పెట్టారా? కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు పడవచ్చని చంద్రబాబు ఆశ. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి పంపారు. కానీ వారాహి బ్యాచ్ కి పనికాలేదు.జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది. పోలవరం పై నాదెండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్ ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారు. దెబ్బ తిన్న పోలవరం డయాఫ్రమ్వాల్ను రిపేర్ చేస్తున్నాం వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాం ’’ అని మంత్రి పేర్కొన్నారు.
