సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ కి టీడీపీ జనసేన బలపరుస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, శనివారం రాత్రి భీమవరంలోని బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో మన సిగ్మా న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తనకు బీజేపీ ఎంపీ టికెట్ వచ్చిన నేపథ్యంలో అభినందలు తెలిపిన అందరికి కృతఙ్ఞతలు తెలుపుతున్నానని, బీజేపీ పార్టీ కోసమే తన జీవితాన్ని దారపోశానని తన 35 ఏళ్ళ కృషి కి తగ్గ గుర్తింపు గా ప్రధాని మోడీ, అమిత్ షా తో సహా మొత్తం 9 మంది కేంద్ర పెద్దల పార్లమెంటరీ కమిటీ నా అభ్యర్ధిత్వాన్ని నరసాపురం పార్లమెంట్ కు ఆమోదించారని, వారి నిర్ణయానికి తిరుగులేదని , కూటమిలోని టీడీపీ జనసేన పార్టీల సహకారంతో ప్రజల మద్దతు తో నా విజయం ఖాయంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒక ప్రశ్న కు సమాధానంగా .. తనకు ఎంపీ రఘురామా అంటే గౌరవం ఉందని అయితే కేంద్ర బీజేపీ నిర్ణయం శిరోధార్యం అని తనకు కేటాయించిన టికెట్ ను ఆయన ఇప్పటికి కోరుకోవడం తగని పని అని.. ఆయన కూటమి మద్దతు దారుడే తప్ప బీజేపీ పార్టీ కి చెందినవారు కాదని, అటువంటిది తమ కేంద్ర పార్టీ తీసుకొన్న నిర్ణయం తో ఎలా విభేదిస్తారని? ప్రశ్నించారు. రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి ,. బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మెన్ పాక సత్యనారాయణ కూడా కూటమి పార్టీలలో ఇది మంచి పద్దతి కాదని తేల్చారని.. ఏమి ఏమైనా కూటమి పార్టీలలో నేతలు అందరు వాస్తవాలు అర్ధం చేసుకొని తనకు ఉన్న రాజకీయ పరిణితి మేరకు తనకు సహకరిస్తున్నారని, ప్రధాని మోడీ లక్ష్యంకు ప్రజలలో ఉన్న ఆదరణ తో వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధిస్తానని , రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రంలో తనకున్న పరిచయాలు మేరకు గతంలోనే ఎన్నో కోట్ల నిధులు రావడానికి కృషి చేసానని ఇకపై ఎంపీ గా పశ్చిమ గోదావరి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతానని శ్రీనివాస వర్మ సిగ్మా న్యూస్ తో తన ధీమా వ్యక్తం చేసారు.
