సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని బనగావ్‌ (Bongaon)లో సీఎం మమతా బెనర్జీ నెటుత్వంలో నేడు, మంగళవారం లక్షలాది ప్రజాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇటీవల బీజేపీ ఎన్డీయే కూటమి పేరుతొ దేశంలో సాధిస్తున్న గెలుపుల మర్మం ఎలాగో తాము కనిపెట్టేశామని, ఇటీవల’బిహార్‌లో ఎన్నికలు జరిగాయి. పాపం..అక్కడి ప్రతిపక్ష నాయకులు బీజేపీ గేమ్‌ను గ్రహించలేక పోయారు. కానీ మాకు వాళ్ల గేమ్‌లు ఏమిటో బాగా తెలుసు. వాళ్ల ఆటలు బెంగాల్‌లో ఎంతమాత్రం సాగవు. బెంగాల్‌ను టచ్ చేయాలని చూస్తే మేము యావద్దేశాన్ని కుదిపేస్తాం’ అని సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బంగ్లాదేశీ హిందువులకు సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారని, ఎస్ఐఆర్ కారణంగా 35 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీజేపీ వాళ్ళు డూప్లికేట్ ఓటర్లను సృష్టించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నారని, ఆరోపించారు. దేశంలో చొరబాటుదార్ల ప్రవేశంపై తనను ప్రశ్నించాల్సిన పనే లేదని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే సరిహద్దులను నిర్వహిస్తున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *