సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో 27 ఏళ్ళ తరువాత బీజేపీ కి ఏకంగా 48 స్థానాలలో ఓటర్లు బ్రహ్మరధంతో అధికార పట్టం కట్టారు. అయితే సుమారు 15 నియోజకవర్గాలలో చాల స్వల్ప మెజారిటీలతో అధికార ఆమ్ అండ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు హోరాహోరీ పోరులో ఓడిపోవడం దురదుష్టకరం. అలాగే ఎన్నికలకు ముందు ఆప్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ విజయం కోసం కూడా పని చేశారు. దీంతో ఆ మొత్తం 8 నియోజక వర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు.70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్కసీటు కూడా గెలుచు కోకుండా హ్యాట్రిక్ ‘జోరో’లతో మూలపడింది. అయితే తన ఓటింగ్ శాతంతో ఆప్ ను అధికారంలోకి రాకుండా పరోక్షంగా అద్దుకొంది. అప్ పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2 లుగా భావించే అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి చవిచూశారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. మనీష్ సిసోడియా జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలోకేవలం 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి మాత్రం తన సమీప బీజేపీ అభ్యర్థి రమష్ బిధూరిపై 3,521 ఓట్ల ఆధిక్యంతో గెలిచి పరువు దక్కించారు.
