సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ కి ఎన్నికలలో శుభ సూచకంగా మొదటి బోణి నేడు, ఆదివారం అయ్యిపోయింది. ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి పేమా ఖండూ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకుంది. నేడు, ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డను కూడా బద్ధలుకొట్టింది.
