సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ బీజేపీ అడ్జక్షుడు సోము వీర్రాజు విజయవాడలో పాత్రికేయులసమావేశం లో ,మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండాలనిలేదు అన్నారు. తాను సుదీర్ఘకాలంగా అంటే ‘‘42 సంవత్సరాలగా రాజకీయాలలో ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తుంది. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేదు’’ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్న గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము ముందు చూపు లేకపోవటం వలన మన రాష్ట్ర పూరోగతిపై దృష్టి లేని కారణముగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచటం అనే ఆలోచన లేకుండా వాళ్ళ స్వప్రయోజనాలకు, కుటుంబ పరిపాలనకు, రాబోవు ఎన్నికలకు ఓటు బ్యాంకు తయారు చేసుకోవటం కోసం పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. సహకారం రంగంలోని డైరీలు, పంచదార మిల్లులను అమ్మేసే మీరు బిజెపిని పల్లెత్తు మాట అనే అర్హత లేదు. బిజెపి కి వ్యతిరేకంగా కోరస్ పాడే కమ్యునిస్టులు నోట్లు మన్నుపెట్టుకున్నారా? అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీసోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుచుగా తెరపైని సంబందంలేని అంశాలు ప్రస్తావిస్తు బిజెపి ని విమర్శించాలని పనిగా పెట్టుకుంటున్నారని తీవ్రస్వరంతో సోమువీర్రాజు వైసిపి, తెలుగుదేశం, కమ్యూనిస్టులను ఏకకాలంలో ప్రస్తావించారు.
