సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అక్కడి పార్టీలతో పొత్తు విషయం మరి కొద్దీ రోజులలో నిర్ణయిస్తామని ఢిల్లీ లో అమిత్ షా తాజగా ప్రకటించిన నేపథ్యంలో.. తెలుగుదేశం – జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా? ఒకవేళ ఉంటె బీజేపీ కి ఎన్ని సీట్లు వదులుకోవాలి? అన్న మీమాంస.. మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరు పార్టీ క్యాడర్స్ లో గందరగోళం సృష్టిస్తుంది. ఇప్పటికే జనసేన కు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7 స్థానాలకు 3 జనసేనకు కేటాయింపు దాదాపు పూర్తీ అయినట్లు సమాచారం. అవి భీమవరం, తాడేపల్లి గూడెం, నర్సాపురం.. అయితే తాజగా సమాచారం ప్రకారం టీపీ గూడెం సిటు మరల టీడీపీకే కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. నిజానికి గతంలో బీజేపీ ఆ స్థానంలో గెలచి రాష్ట్ర మంత్రిగా స్వర్గీయ మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహించిన స్థానం.. బీజేపీ కలసి వస్తే ఆ స్థానం వారికే? వదిలెయ్యవలసి ఉంటుంది. ఇక తణుకు టికెట్ ఇంకా జనసేన కేటాయిస్తారనే ఆశలు ఆ పార్టీ నేతలలో సజీవంగా ఉన్నాయి. అలాగే నరసాపురం లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారు అనుకున్న ప్రస్తుత వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణంరాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ కూటమిలో లేకపోతె బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నికలు చుస్తే పట్టుమని 2నెలలు లేవు.. ఇటువంటి కూటమి గందరగోళం మధ్య.. జనసేన అధినేత పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో నేతలతో సమావేశానికి ఈ 14న జిల్లా కేంద్రం భీమవరం వస్తున్నారు. ఆయన మాత్రం జనసేన తరపున భీమవరం నుండే పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఎదో ఒక అద్భుతం జరిగి తాను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భీమవరం నుండే పోటీ చేస్తానని ఇంకా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఆయన ప్యూహం ఆయనకు ఉంది. నిజానికి ఈనెల 14న చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పాలకొల్లులో ఉమ్మడిగా బహిరంగ సభలో పాల్గొనవలసి ఉంది.. అయితే, బీజేపీతో పొత్తు డైలమా తో వాయిదా పడింది. అయితే అదే రోజున భీమవరంలో మాత్రం పవన్ కల్యాణ్ పర్యటన ఉంటోంది. పవన్ ఎన్నికల నాటికి భీమవరంలో మూడు పర్యాయాలు పర్యటించే ప్యూహంలో ఉన్నారు. ఇదిలా ఉండగా…ఇక భీమవరం జంట నియోజకవర్గం.. ఉండి లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కు టికెట్ కే ఖరారు అని లీక్ వచ్చినప్పటికీ తాను తగ్గేలే లేదు అంటున్నారు మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు… ఇలా ఎన్నో సమస్యలకు మరో వారం రోజులలో పరిష్కరం దొరుకుతుందా?.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
