సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై తాజగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుతూ.. . ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. దానితో తాజాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరుగుతున్నా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి స్వాందిస్తూ .. దగా పడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయటమే తన ముందున్న లక్ష్యమన్నారు. పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరమన్నారు. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందు రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై పోరాడుతున్నామని, దీనిని ఢిల్లీ లో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొనివెళ్ళామని ఈ అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
