సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ఆధ్వర్యంలో భీమవరంలోని ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి అధ్యక్షతన , భీమవరం పట్టణ బీజేపీ అడ్జక్షుడు కాగిత సురేంద్ర సమన్వయంతో గత ఆదివారం రాత్రి, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులకు, అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి,పేరిచర్ల సుభాష్ రాజు, టీవీఎస్ వర్మ, నార్ని తాతాజీ, అల్లూరి సాయి దుర్గరాజు, ఈతకోట తాతాజీ, కలిదిండి వినోద్ వర్మ, పద్మావతి, పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ .. తనలాంటి సామాన్య కార్యకర్తను ఎంపీ గా కేంద్ర మంత్రిగా చేయటం ద్వారా రాష్ట్ర బిజెపిలో కార్యకర్తల హవా ప్రారంభమైందని, జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ని మరింత బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ లో పైరవీలకు విలువ లేదని, కులం, డబ్బు ప్రతిపాదన రాజకీయాలు బిజెపిలో సాధ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల స్టీల్ ప్లాంట్ సెంటిమెంటును తెలియజేపి కేంద్ర ప్రభుత్వం సుమారు 13 వేల కోట్ల రూపాయల తీసుకోని రావడం, నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధికి ఆకివీడు- దిగమర్రు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు 2,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు సాధించడం, పిప్పర నుండి లోసరి వరకు రోడ్డు నిర్మాణానికి సి ఆర్ ఐ ఎఫ్ నిధులు నుండి 100 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డయాలసిస్ యూనిట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు, సిఎస్ఆర్ నిధుల నుండి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్ల రూపాయలు మంజూరు వంటి ఘనతలు అధికారంలోకి వచ్చిన కొద్దీ కాలంలోనే సాధించడం జరిగిందన్నారు.
