సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా విజయవాడలో దగ్గుబాటి పురంధరేశ్వరి ఇతర బీజేపీ పెద్దలు నిన్న, నేడు, ఆదివారం ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల ముఖ్యులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి లో చేరటామా ? లేక ఒంటరిగా బరిలో దిగటమా ? అన్న మీమాంసఫై కూడా పార్టీ పెద్దలతో సమీక్ష జరిగింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీలో అన్ని స్థానాలలో ఒంటరిగా అభ్యర్థులను బరిలో దింపితే ఓట్ల శాతం పెరుగుతుందని, పార్టీ బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయం పడినట్లు సమాచారం. నేడు ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, నరసాపురం లోక్‌సభా స్థానాల పరిధిలోఎన్నికలలో పోటీ చేసే ఆశావహుల పరిశీలన ముగ్గురితో జాబితా రూపొందించేలా కార్యచరణ సిద్ధం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాలకు దాదాపు వంద మందిపైగా దరఖాస్తు చేసుకున్నారు దీనిలో భీమవరం కు చెందిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాసవర్మ, విక్రమ్‌ కిషోర్‌, తాతాజీ, తో పాటు ఏలూరు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భావిస్తున్న తపన చౌదరి పాల్గొన్నారు. మోదీ ఇమేజ్‌ ఒకవైపు, రామమందిర నిర్మాణం ఇంకోవైపు పార్టీ పటిష్టత ఏపీలో కూడా బాగా పెరిగిందని ఇది వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు ఇప్పటికే పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మూడు నుంచి ఏడు వరకు దర ఖాస్తులు అందగా వాటిని పరిశీలిస్తున్నారు.బీజేపీ, జాతీయ సహ సంఘటన్‌ కార్యదర్శి శివప్రకాశ్‌ నేతృత్వంలో అభ్యర్థుల స్ర్కీనింగ్‌ కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *