సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బీజేపీ కేంద్ర అధిష్టానం ఎవరి అంచనాలకు అందకుండా ఏపీ లో పూర్తిగా బీజేపీ భావజాలంతో పార్టీకోసం ముందు నుండి కష్టించిన వారికే పెద్ద పీట వేస్తుంది. తాజగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను అధిష్టానం ఆదేశాలతో మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (PVN Madhav) చేపట్టారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్‌కు బీజేపీ జాతీయ, ఏపీ నాయకులు కూటమి నేతలు అభినందనలు తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వాహకుడిగా బెంగుళూరు ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ వ్యవహారించారు.
