సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు.. అన్న సామెత ఏపీ రాజకీయాలలో మరోసారి రుజువు కాబోతుంది. గత 2 రోజులుగా ఏపీలో పర్యటించిన బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఇద్దరూ ఒక్కసారిగా జగన్ సర్కార్ ఫై తీవ్ర విమర్శలు చేయడంపై ముందుగా నడ్డా వ్యాఖ్యలు ఫై మాజీ మంత్రి పేర్ని నాని .. మొన్న కర్ణాటక లో చేసిన అవినీతి తోనే బీజేపీ ని ప్రజలు చీ కొట్టిన, మణిపూర్ లో మంటలు ఆర్పలేకపోయిన ఇక్కడకు వచ్చిన బీజేపీ పువ్వులు తామేదో దేశాన్ని అంతా ఉద్ధరిస్తునట్లు ‘ఆరిందా మాటలు’ మాట్లాడటం సిగ్గుచేటని… చాల ఘాటైన వ్యాక్యలు చేసిన దరిమిలా విశాఖలో హోమ్ మంత్రి అమిత్ షా జగన్ సర్కార్ అవినీతి మయం అని, రైతుల ఆత్మ హత్యలతో జగన్ సిగ్గు పడాలని చెలరేగిపోయారు. ఇక నేడు, సోమవారం సీఎం జగన్ తానే స్వయంగా స్పందించారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు. 14 ఏళ్లుగా చంద్రబాబు ఏ గాడిద పళ్ళు తోమాడు ? అని పరుషంగా మాట్లాడారు. ( ఏపీలో టీడీపీ తో బీజేపీ కూడా భాగస్వామ పాలన చేసింది మరి..) దుష్ట చతుష్టయం , దత్తపుత్రుడు తో పాటు బీజేపీ అండ లేకపోయిన తనకు దేవుడు ప్రజలు అండ ఉందన్నారు. ఇక పేదల పక్షాన నిలబడిన తనకు , పెత్తందారులకు కురుక్షేత్ర యుద్ధం తప్పదని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అమిత్ షా ను గతంలో టీడీపీ వారు రాళ్లతో కొట్టిన సిగ్గురాలేదని విమర్శించారు. మొత్తానికి ఈ పరిణామాలు టీడీపీ జనసేన, బీజేపీ కూటమి కి దారి సుగమం చేస్తుందని అటుపార్టీ వర్గాలు భావిస్తుంటే.. ఇది ఒకందుకు మంచిదే పార్టీకి ఇంకా BC, SC, ST తో పాటు మైనారిటీ ఓట్లు కూడా పూర్తిగా కలుస్తాయి అని వైసిపి పెద్దలు లెక్కలు వేస్తున్నారు. ఒక ప్రక్క.. ఒక్క వారం వ్యవధిలో 23 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇచ్చి జగన్ సర్కార్ ను విమర్శించడం వెనుక బీజేపీ పెద్దల అసలు ప్యూహం ఏమిటో? అన్ని మర్చిపోయి 4వ సారి టీడీపీ తో బీజేపీ కూటమి కడుతుందా?
