సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం పట్టణం 29వ వార్డుకి చెందిన టీడీపీ కార్యకర్త బండి లక్ష్మణకుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని కుటుంబానికి రూ 5 లక్షల భీమా నగదును టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతులమీదుగా టిడిపి కార్యాలయంలో నేడు ఆదివారం అందజేశారు. టిడిపి కార్యకర్త బండి లక్ష్మణ్ కుమార్ గతంలో పార్టీ నుండి రూ 100 సభ్యత్వం తీసుకోవడం జరిగిందని ఆయన దురదృష్టవశాత్తు జూన్ నెలలో నర్సాపురం పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారని ఆయనకి భార్య ఇద్దరు కుమార్తెలును ఆదుకొనే లక్ష్యంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి నుండి ప్రమాద బీమా నగదు రుసుమును రూ 5 లక్షలు వారి బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరిగిందని వివరించారు, ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చల్లబోయిన గోవింద్ క్లస్టర్ ఇంచార్జ్ పడమట సోమేశ్వరరావు, గొలగాని రమేష్ ,ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *