సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 7న్నర కోట్ల ఓటర్లు ఉన్న పెద్ద రాష్ట్రము బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ నేడు గురువారం ఉదయం 7 గంటలనుండి ప్రశాంతంగా జరుగుతుంది. నేటి మధ్యాహ్నం వంటి గంట వరకు సుమారు 38 శాతం పోలింగ్ నమోదైంది. మహాఘట్బంధన్ సీఎం, అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర మార్పు కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగాల కొరకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ.. ఈ ఎన్నికలలో ప్రజలు ముఖ్యంగా యువత ఉత్సహంగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. మొదటి దశలో నేడు, రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు.
