సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు, శుక్రవారం వెలువడుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13 పోలింగ్‌ నమోదైంది. సుమారు 7.45 కోట్ల మంది ఓటర్లలో 67.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 2020 ఎన్నికల్లో 57.29 శాతం ఓటింగ్‌ జరిగింది. తాజా ఎన్నికలలో విజయంపై . సీఎం నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని ఎన్‌డీఏదే మళ్లీ గెలుపని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు పేర్కొన్నాయి. మహాగఠ్‌బంధన్‌ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ఆధిక్యత లలో 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తీ అయ్యేసరికి ఎన్డీయే కూటమి అభ్యర్థులు 179 స్థానాలలోను ‘మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు కేవలం 60 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు. నేటి మధ్యాహ్నం 4గంటల కల్లా పూర్తీ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో 3 రౌండ్లు కు కాంగ్రెస్ అభ్యర్థి సుమారు 3వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బిఆర్ ఎస్ అభ్యర్థి వెనుకబడి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *