సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో బారి వరదలుతో విజయవాడ జనజీవితాన్ని 5 రోజులు స్తంభింప చేసిన బుడమేరు గండ్లను నేడు, శనివారం పూర్తిగా పూడ్చివేశారు. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. నేడు శనివారం మధ్యాహనానికి వందలాది సికిందరాబాద్ కు చెందిన 40 మంది ఆర్మీ జవాన్స్ సహకారంతో నేటి సాయంత్రానికి మూడో గండిని పూడ్చి వేశారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను విజయవతంగా పూర్తిచేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను అభినందించారు. ఈ నేపథ్యంలో నేడు, శనివారం గండిపూడ్చే పనులను రామానాయుడుతో కలిసి మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. తదుపరి కైకలూరు లో ప్రమాద స్థాయిలో వంతెనపై కి కూడా ( ఏలూరు వెళ్లే వాహనాలు నిలిపివేశారు)చేరి ప్రవహిస్తున్న కొల్లేరు ను పరిశీలించారు. ప్రమాదనివారణకు అధికారులతో చర్చలు జరిపారు. నేడు, శనివారం ఆకివీడు లో కూడా కొల్లేరు తో పాటు…ఉప్పుటేరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ప్రజలను భయబ్రాంతుల్లకు గురిచేస్తుంది. అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
