సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మీడియాలో ఉండిలో ఎమ్మెల్యే రఘురామా.. కు బహిరంగ సవాళ్లు విసురుతున్న వెలివర్రు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు ఎలియాస్ బుడ్డీయరాజు వ్యాక్యలపై వీడియో లపై.. జిల్లా తెలుగుదేశంపార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు నేడు, బుధవారం భీమవరం చినమీరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. తెలుగుదేశంపార్టీలో ప్రతి కార్యకర్త సభ్యుడు క్రమశిక్షణతో నడుచుకుంటారని అందుకు విరుద్ధంగా ప్రస్తుత శాసనసభ్యులు గతంలో పనిచేసిన శాసన సభ్యులను. పార్టీ నాయకులను అగౌరపరుస్తూ బహిరంగంగా విమర్శిస్తూ పత్రికలలోనూ టీవీలలోనూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధిష్టానం వరకు తన వ్యక్తిగత సమస్యలు ఫిర్యాదులు తెలియచేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే అందుకు విరుద్ధంగా ప్రవర్తించినందున బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.. దీనితో బుడియా రాజు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పారు నా వ్యాఖ్యలు ఎవ్వరిని ఉద్దేశించినవి కాదు. పార్టీలో నాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాలన్నదే నా ప్రయత్నం. నా వ్యాఖ్యలు బాధిస్తే ఉపసంహరించుకుంటున్న…అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *