సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బెంగళూరులో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్ శివిర్ 2025 (chintan shivir) ను నేడు, సోమవారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ఈ సందర్భముగా సభలో వర్మ మాట్లాడుతూ.. 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగు తున్నామని అన్నారు. ప్రపంచ తలసరి ఉక్కు వినియోగం సగటు 219 కిలోలు ఉంటే భారతదేశంలో 97.7 కిలోల మాత్రమే ఉందని 2030 నాటికి 170 కిలోలకు పెంచాలన్నది లక్ష్యం పెట్టుకున్నమన్నారు.ఈ సందర్భంగా ఏప్రిల్ లో నిర్వహించనున్న ఇండియా స్టీల్ యొక్క 6వ ఎడిషన్ కు సంబంధించి ఇండియా స్టీల్ 2025 వెబ్‌సైట్ ను కేంద్ర మంత్రి వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు
