సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బెంగళూరు సమీపంలో గత ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.దానిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యా రు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మోడల్స్ , కొందరు సాఫ్ట్ వేరే ఉద్జోగులను పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 20మందికి పైగా యువతులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ.. ఆయన నిన్న హైదరాబాదులోనే ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు సీనియర్ నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీంతో ఆమె బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సం బంధం లేదని ,తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కానీ కన్నడ మీడియా హేమ అక్కడ ఉన్నట్లు ప్రకటించడం విశేషం.
