సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బెట్టింగ్ వ్యసనాలకు ప్రేరేపిస్తూ.. ఎందరో యువత ఆత్మహత్యలకు, భవిషత్తు నాశనం కు కారణం అవుతున్న బెట్టింగ్ యాప్‌లను (Betting Apps) నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) నేడు, శుక్రవారం విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల (ఆగస్టు) 18వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో కేంద్రప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్రప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని అసలు బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామని తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది
