సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్న , ఎన్నో ఆత్మ హత్యలకు కారణమౌతున్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీ లపై , యూ ట్యూబుర్లపై , సజ్జనార్ పిలుపు మేరకు తెలంగాణ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసుకొంటున్న నేపథ్యంలో తాజగా టాలీవుడ్ ప్రముఖులు, టివి యాంకర్స్ ఫై కూడా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు తాజగా కేసులు నమోదు చేసి చిన్న పెద్ద ప్రమోటర్స్ ను ఎవరిని వదిలేదె లేదని హెచ్చరిక జారీ చేసారు..అయితే చిన్న స్థాయి యూ ట్యూబర్ లను అరెస్ట్ చేసి బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన పెద్ద సెలబ్రెటీలు అరెస్ట్ చెయ్యకుండా వదిలేస్తారని టాక్ నడుతుండటంతో ఏమి జరుగుతుందో ఎన్ని వత్తిడులు వచ్చిన పోలీస్ అధికారుల నిబ్బద్దత చూడాలి.
