సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం కార్తికేయ హీరోగా నేహాశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’ ఇటీవల విడుదలయి మంచి విజయాన్ని నమోదు చేసుకొన్నా విషయం విదితమే.. యుగాంతం నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఒక లంక గ్రామం ప్రజలను కొందరు పెద్దలు మూఢనమ్మకాలతో ఎలా బెదరగొట్టారు? వారి బంగారం ఆస్తులు దోచెయ్యాలనుకున్న వారి కుట్ర ను హీరో ఎలా ఛేదించాడో? అన్న కధాంశంతో నవ్వులు పూయించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దర్శనమిచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా ఈ చిత్రం స్టీమింగ్ అవుతోంది. ఇక ఓటిటి లో ‘బెదురులంక 2012’ చూసెయ్యండి..
