సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం మండలం బేతపూడి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 40 లక్షల పైగా ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. తదుపరి, తాడేరు వంతెన నిర్మాణం కోసం జరుగుతున్న డైవర్షన్ రోడ్డు, క్రాస్ బండ పనులను పరిశీలించారు. నిర్ణిత సమయానికి తాడేరు నూతన వంతెన పూర్తీ కావాలని, క్వాలిటీ తో నిర్మాణం చెయ్యాలని కాంట్రాక్టర్స్ కు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
