సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు గ్రామం పెదఅమిరంలో గత ఏప్రిల్ నెల 30న రొయ్యల లోడు లారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను కాళ్ల పోలీస్ స్టేషన్ లో గత బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ యు.రవిప్రకాశ్ తెలిపారు. పెదఅమిరంలో నిలిపిన రొయ్యల లోడు లారీ అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యా దు మేరకు డీఎస్పీ బి.శ్రీనాథ్ పర్య వేక్షణలో ఆకివీడు సీఐ ఎం .గీతారామకృష్ణ, సీసీఎస్ సీఐ ఆకుల రఘు, కాళ్ల ఎస్సై ఏజీఎస్ మూర్తి, భీమవరం క్రైం ఎస్సై లు రెహమాన్, ఆదినారాయణ, సిబ్బందితో మూడు బృందాలగా చేప్పట్టిన గాలింపు చర్యలు ఫలితంగా చింతలపూడి-సత్తుపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆ లారీ, రొయ్యలకు సంబంధించి 120 ప్లాస్టిక్ ట్రేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన నలుగురి సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగులు వ్యసనాలకు బానిసలైన నిందితులలో సీహెచ్.లక్ష్మీగణపతి (మొగల్తూరు మండలం కొత్తపాలెం), ఎం. సాగర్‌రెడ్డి (అల్లూరి సీతారామరాజు జిల్లా) ఎం. ఏడుకొండలు (ఏలూరు జిల్లా), ఎస్కే మస్తాన్‌వలీ (ఎన్టీఆర్ జిల్లా ) ఉన్నారు. వీరి నుంచి రూ.4.07 లక్షల నగదు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
