సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం విజయవాడలో ఇటీవల కొత్తగా టీడీపీ ఎమ్మెల్యే బోం డా ఉమామహేశ్వరరావు తనపై కక్ష సాధింపుల పాలబడుతున్నారని దళితనేత శిరోముండనం చేయించుకున్న ఘటన సంచలనం రేపింది. ఒక్కప్పుడు టీడీపీ లో పనిచేసి తరువాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గత అసెం‍బ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో మాజీ కార్పొరేటర్ నందెపు జగదీష్ తన నివాస భవనాన్ని అధికారులు బోండా ఉమా ప్రోద్భలంతో జేసీబీతోకూలగొట్టారని ఆరోపిస్తూ దానికి నిరసనగా శిరోముండనం చేయించుకొన్నారు. ఆయన భార్య కూడా శిరోముండనం చేయించుకోవడానికి సిద్ద పడగ స్థానిక పోలీస్ లు అడ్డుకొన్నారు. అప్పుడు ఆమె బోండా ఉమా ఇక్కడికి వస్తే తాను శిరోముండనం చేయించుకొని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతానని తమను వేదించవద్దని వేడుకొన్నారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత వైఎస్సా ర్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా? ఎంపీ పోటీ చేసిన వైసీపీ నేత కేశినేని నానికి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని నన్ను వదిలేశారని ఆరోపించారు.. గతంలో బోండా ఉమాకు మద్దతుగా నిలిచి ఆయన ను గెలిపించాను. అప్పుడు వైసీపీ వాళ్ళు నాపై కక్ష కట్టలేదు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా, ఆయన కాళ్ళు పట్టుకుంటా. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ప్ష మెంబర్ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *