సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. భీమవరంలో నేడు, 4 థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన అఖండ .. అన్ని షోలు ఆన్ లైన్ బుకింగ్ లో ఒకరోజు ముందే టికెట్స్ అమ్ముడుపోయాయి. గతంలోలా భారీ రేట్లు కాకుండా కేవలం టాక్స్ లతో కలపి 70 రూపాయలు నుండి 120 రూపాయలు టికెట్ రేటు దాటాకపోవడం విశేషం. అఖండ.. చాలా బాగుందని ప్యాన్స్ టాక్. సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్ నేపథ్య సంగీతం , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్.. ఇక బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్ ఈళలు మారుమ్రోగుతున్నాయి ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడు. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్ ఇక . ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు కొద్దీ సన్నివేశాలు ఉన్న అదరగొట్టాడు. విలన్ శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. మొత్తానికి బోయపాటి, బాలయ్యతో హ్యాట్రిక్ సూపర్ హిట్ కొట్టాడు..
