సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ కేంద్రం గా పనిచేస్తున్న సంకల్ప్ మార్ట్ సంస్థ మొత్తానికి బోర్డు త్రిప్పేసింది. నిత్యావసర సరుకులు, ఎర్రచందనం మొక్క ల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల్లోవాటా పొందవచ్చని, ఉన్నంతలో రూ. వెయ్యి నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెడితే రోజువారీగా కొంత ఆదాయం డిపాజిట్దారుల ఖాతాల్లోజమ చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఇప్పుడు ముఖం చాటేయడంతో సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినవారు వారితో లింక్ తరహాలో పెట్టుబడి పెట్టించిన లోకల్ ఏజెంట్స్ తీవ్ర మనోవ్యధ చెందుతున్నారు. ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే కాదు..తెలంగాణ రాష్ట్రంలో కుగ్రామం మోర్తాడ్ లో సంకల్ప్ మార్ట్ సంస్థకు ఇద్దరు ప్రతినిధులు కలసి దాదాపు నాలుగు వందల మందితో రూ. 50లక్షల వరకు డిపాజిట్ చేయించారు అంటే ఈ స్కాం లో తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కోట్ల డబ్బు మోసగాళ్ల పాలయిందో అర్ధం చేసుకోవచ్చు . . సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి ఆన్లైన్లో లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చా రు. భారీ లాభాలు వచ్చాయని నమ్మించి ఖాతాల్లోజమ చేయించారు. ఇలా లాభాలు పొందినవారి పేర్లు చెబుతూ తమ ఖాతాదారుల సంఖ్య ను భారీగా పెంచుకున్నారు. పెట్టుబడి పెట్టినవారికి సంస్థ యజమాని 10 రోజుల క్రితం అరెస్టు అయ్యాడని అతను బైయిలుపై బయటకు రాగానే సంస్థ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని పాపం ప్రతినిధులు ఇంకా నమ్మిస్తున్నా రు. డిపాజిట్లు చేసిన వారు తమ సొమ్ము వాపసు చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి నా ప్రయోజనం లేకపోయింది.నిజానికి డిపాజిట్ దారులలో 10 శాతం మంది బాగుపడితే 90 శాతం మందికి అతీగతీ లేకుండా అయ్యింది.
