సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ,రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై సీఎం చర్చలు జరిపారు. ఎస్ఎల్ బీసీ సమావేశాలు.. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు. రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇండికేటర్లు కూడా రోటీన్‌గా మారుతున్నాయని చెప్పారు. బ్యాంకర్ లు మారుతున్నా ప్రపంచానికి అనుగుణంగా తీరు మార్చుకోవాలని అన్నారు. రైతులకు ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చిందని. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయని.. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని అన్నారు.
