సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఈ నెల 30, 31వ తారీఖుల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగులు భావిస్తున్నట్లు తాజా వార్త కధనాలు వస్తున్నాయి. ఈ కారణంగా జనవరి నెల చివరి నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవని వస్తున్న వార్తల నేపథ్యంలో నిజంగానే బ్యాంకులు నెలచివర మూసేస్తాయా? విషయంలోకి వెళ్ళితే బ్యాంక్ యానియన్లు కొన్ని విషయాలను ప్రస్తావించి తమ డిమాండ్స్ ను నెరవేర్చాలని లేని పక్షంలో తాము బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ విధులు నిర్వహించడం ఆపి సమ్మె చేపడతామని పిలుపునిచ్చాయి. ఈ డిమాండ్స్ లో.. వారంలో అయిదు రోజులు మాత్రమే పని ఉండాలనేది వీరి మొదటి డిమాండ్, ఇక పెన్షన్ విషయంలో పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దించి, కొత్త పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని తెలిపాయి. ఈ డిమాండ్స్ నేపథ్యంలో బ్యాంక్ యూనియన్లు అన్నీ కలిసి సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఈలోగా చర్చలు జరగకపోతే వచ్చే సోమవారం, మంగళవారం కూడా సమ్మె జరిగితే?వరుసగా నేటి శనివారం నుండి 4 రోజులు బ్యాంకులు మూతపడినట్లే..?
