సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెయ్యికి పైగా ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం కలిగి, ఆసక్తి కలిగినవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ ను సందర్శించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1,031 పోస్టులు ఉండగా.. ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విద్యార్హత వివరాలను స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. ఏటీఎం ఆపరేషన్స్‌లో పనిచేసిన అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. జీతాలు స్కేల్ విషయానికి వస్తే ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్- నెలకు 36,000 రూ. ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్- నెలకు 41,000 సపోర్ట్ ఆఫీసర్- నెలకు 41,000 రూ. నిర్ణయించారు,
