సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికీ, ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికీ ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పాయి. మార్కెట్‌లో ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను క్రమంగా తగ్గించే అవకాశం ఉంది వడ్డీ రేట్లు తగ్గితే నెలవారీ ఈఎంఐల భారం కొంత తగ్గనుంది. ప్రధానంగా హౌసింగ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారికి ఇది ఎక్కువగా ప్రయోజనం చేస్తుంది. ఈ స్వతంత్ర దినోత్సవ కానుకగా ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లు వడ్డీ రేట్లు తగ్గింపు అమలులోకి తెచ్చాయి. ఉదాహరణకు SBIలో హోం లోన్ తీసుకుంటే ఎక్కువగా 1 Year MCLR మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది 8.80% నుంచి 8.75%కి తగ్గడం మంచి పరిణామం.
