సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం మధ్యాహ్నం విశాఖ కు హెలికాఫ్టర్ లో వైసీపీ అధినేత జగన్ చేరుకోవడం .. అక్కడ నుండి సింహాచలం వెళ్లే దారి లో జగన్ భారీ కాన్వాయ్ కి అడుగడుగునా తరలివచ్చిన వైసీపీ అభిమానులు అడ్డగించడంతో ఎక్కువ సమయం పట్టింది. పవిత్ర పుణ్యక్షేతంలో నేటి ఉదయం మరణించిన భక్తుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. లక్షల మంది వస్తారని తెలిసి కూడా కొత్తగా 2 రోజుల క్రితం కొత్త గొడ కట్టడం ఏమిటి? మొత్తం 8మృతులలో ఒకే కుటుంబంలో 4గురు చనిపోయారు. స్వామివారి చందనోత్సవం కు ఎన్నో లక్షల మంది వస్తారో? తెలియదా? భక్తుల ప్రాణాలు కు రక్షణ కల్పించలేకపోవడం దారుణం అని, చంద్రబాబు ఎడారి పాలన లో ఇన్ని దారుణాలు చూడవలసి వస్తుందని అనుకోలేదని..గతంలో కూడా ఇదే తరహాలో గోదావరి పుష్కరాలలో 29 మంది మరణించారని, వైకుంఠ ఏకాదశి కి తిరుమలలో , ఇప్పుడు సింహాచలంలో ఇంత మంది భక్తులు ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ప్రశ్నించారు. గత నా పాలనలో చిన్న పొరపాటు జరిగిన అల్లరి చేసేవారు, మరి ఇటీవల తిరుమల గోశాలలో గోవులు చనిపోతున్నాయి వాటిని పట్టించుకోరు. మొన్న ఎంతో మంది ఆకలి తీర్చే కాశీ నాయన క్షేత్రం లో సత్రాన్ని బుల్ డోజర్లు తో కూల్చివేశారు. శ్రీకాకుళం శ్రీ కుర్మా క్షేత్రంలో ఎన్నో తాబేళ్లు చనిపోయాయి ఏమిటి ఈ దారుణాలు? దీనికి సీఎంగా చంద్రబాబు బాధ్యత లేదా? తాను విశాఖ వస్తునన్ని తెలిసి భక్తుల కుటుంబాలకు 25 లక్షల చప్పున పరిహారం ప్రకటించారని అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆ మొత్తం సరిపోదని ఇంకా పెంచాలని డిమాండ్ చేసారు.
