సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల నిమిత్తం విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్‌ లో సినిమా టైటిల్ ను పవన్ కాళ్ళ క్రింద వెయ్యడంపై నటి పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుడి పేరుని హీరో కాళ్ల కింద పెట్టడం ఏమిటని? ఇది కచ్చితంగా ఆ స్వతంత్ర యోదుడుని అవమాన పరచడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై ఆమె చేసిన పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో అనుబంధం విషయంలో పూనమ్ కౌర్ ఫై పలు రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. పూనమ్ కౌర్ కూడా అప్పుడప్పుడు సందేహాస్వాద కామెంట్స్ తో పవన్ ను ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తూ తరువాత తన ఉద్దేశ్యం అది కాదంటూ సర్దుకొంటుంది..తాజగా మరోసారి పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో.. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోండి. రాజకీయం‌గా కూడా మీకు మంచి పేరు వస్తుంది. అంతేకానీ.. ఇలా లేనిపోని కాంట్రవర్సీలతో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు, సినిమా పోస్టర్‌ని పోస్టర్‌లా చూడండి..నిన్నెవరూ పట్టించుకోవడం లేదని.. ఇలా ఫేమస్ అవుదామని చూస్తున్నావా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *