సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ రాములోరి భూములు అక్కడికి సరిహద్దులో (ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ) అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూములు 889 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూములు స్థానిక నేతల ఆధ్వర్యంలో కబ్జాకు గురవుతున్నాయి,అని సమాచారం అందుకున్న, రామాలయం ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని అక్కడ చేస్తున్న అనధికార నిర్మాణాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో కబ్జాదారులు ఈవో రమాదేవిపై ఒక్కసారిగా దాడి చేశారు. దాడిలో స్పృహ కోల్పో యిన ఈవోను కొందరు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారం లో ఏపీ హైకోర్టు కూడా గతంలో దేవస్థానానికి అనుకూలం గా తీర్పు ఇచ్చింది. ఆలయభూములకు సంబంధిం చి దేవస్థానానికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తమ దేవాలయ ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్‌ పెడతామని హెచ్చరించారు. ఈ సమస్య ను పరిష్కరించాలని భూములు ఆక్రమించిన వారిపై, దాడి కి పాల్బడినవారిపై ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. ఈవో రమాదేవిపై దాడిని తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *