సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగులో జగపతి బాబు ఆమనీ, రోజా నటించిన శుభలగ్నం.. సినిమా లో భర్తను కోటి రూపాయలకు అమ్మేస్తుంది భార్య.. ఈ కధకు యదార్ధ రూపం గా ఇటీవల కర్ణాటకలో సరిగ్గా ఇదే ఘటన జరిగి అందరిని నివ్వెరపరుస్తుంది. అయితే 5 లక్షలకే బేరం కుదిరింది లెండి.. వివరాలలోకి వెళ్ళితే కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామం లో స్థానికం గా ఉండే ఒక డబ్బున్న మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని అతడి భార్య గుర్తించి వారిద్దరిని… ఉన్నపుడు పట్టుకొని నిలదీసింది. దానితో ఆడవాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ గ్రామా పంచాయితీకి చేరింది. అక్కడ ‘నీ భర్త ఖర్చుల కోసం నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బు చెల్లించి, ఇంటికి తీసుకువెళ్లు.. లేదా మరో 5 లక్షలు నీకే ఇస్తాను నీ భర్తను నాకు పూర్తిగా వదిలెయ్యి ’ అని ఆ మహిళ ‘బిగ్ బాస్’ తరహాలో మంచి ఆఫర్ ఇవ్వడంతో విచిత్రంగా ఆ గృహిణి భర్తను అమ్మేయడానికి అంగీకరించింది. దానితో పంచాయితీ పెద్దలు ఇద్దరికీ మంచి చెడ్డలు చెప్పి రాజి ఒప్పందం చేసారు. ఆ 5 లక్షల డబ్బు చెల్లించడానికి ఒక నెల సమయం గడువు అడిగిందట.. భర్తను కొనుగోలు చేసిన మహిళా.. ఇదే ఆధునిక మహాభారతం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *