సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ హీరో కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాతో 5 ఏళ్ళ క్రితం మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత అతని సినిమాలు ఏవి సరైన హిట్ ఇవ్వలేదు. అయితే విభిన్న కదంశంతో గోదావరి జిల్లాలో షూటింగ్ చేసిన ‘బెదురులంక 2012’ అనే సినిమాతో నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి క్లాక్స్ అనే అతను దర్శకుడు, అతనే రచయిత కూడాను. మరి ఈ సినిమా అతనికి విజయాన్ని ఇచ్చిందా? సినిమా కధ ఎలా ఉందంటే… గోదావరి జిల్లాలోని బెదురులంక అనే ఊరులో 2012 లో జరిగిన కథ. ఆ సంవత్సరంలో యుగాంతం వస్తుంది అని ప్రజలు భయపడుతూ వుంటారు, టీవిలో వార్తలు కూడా అలాంటివే వస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ ఊళ్ళో వున్న భూషణం (అజయ్ ఘోష్), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డానియల్ (ఆటో రాంప్రసాద్) ఆ ఊరి ప్రజల భయాన్ని చూసి కొన్ని మూఢనమ్మకాలని ప్రబలించి వూర్లో ప్రజల డబ్బుని దోచెయ్యాలని ఒక పథకం వేస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గ్రాఫిక్ డిజైనర్ గా వుద్యోగం చేసుకుంటున్న శివ (కార్తికేయ) ఉద్యోగం మానేసి తన సొంతవూరు అయిన బెదురులంక వచ్చేస్తాడు. ఇక్కడ అతను ప్రేమించిన ప్రెసిడెంట్ గారి కుమార్తె చిత్ర (నేహా శెట్టి) ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటాడు. శివ ఆ మూఢనమ్మకాలని నమ్మడు, వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. మరి, యుగాంతం వచ్చి ఆ బెదురులంక అనే వూరు కొట్టుకుపోయిందా?వెండితెర మీద చూడాల్సిందే! ఇక ఈ సినిమాను దర్శకుడు క్లాక్స్ చాల వైవిధ్యంగా ప్రేక్షకులకు మొదటి భాగం ఆసక్తి కరంగా మలిచాడు. మూఢ నమ్మకాలతో పాటు కామెడీని జతచేసి ప్రయోగం చేసాడు. ఇక రెండో సగంలో మాత్రం కథ కొంచెం ట్రాక్ తప్పింది అయినప్పటికీ చివరకు ప్రేక్షకులను అలరిస్తుంది. హీరో కార్తికేయ తన పాత్రని కామెడీ టచ్ ను జోడించి బాగానే చేసాడు. చాలా సన్నివేశాల్లో తన బాడీని చూపించడానికి అన్నట్టు వున్నాయి. నేహా శెట్టి పాత్ర ఏమీ అంత పెద్దగా లేదు. సినిమాలో మాత్రం ప్రధాన హైలైట్ శ్రీకాంత్ అయ్యంగార్ , అజయ్ ఘోష్ , ఆటో రాంప్రసాద్ లు చెలరేగిపోయారు. వాళ్ళు ముగ్గురూ కూడా బాగా చేశారు. మాటలు, జోక్స్ పేలాయి. మణిశర్మ సంగీతం పరవాలేదు, ఛాయాగ్రహణం బాగుంది, గోదావరి పచ్చదనంతో ప్రేక్షకులకు మంచి కాలక్షేపం. బెదురులంక 2012

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *