సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో ముడి చమురు( క్రూడ్ ఆయిల్) దిగుమతుల్లో ఒపెక్ (OPEC) దేశాల వాటా క్రమం గా తగ్గుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలో మొత్తం దిగుమతుల్లో ఒపెక్ దేశాల వాటా 46 శాతానికి పడిపోయింది. రష్యా వాటా 36శాతం పెరిగిపోయింది ఉక్రెయిన్ ఫై రష్యా యుద్దానికి ముందు 2022 ఏప్రిల్ నెల వరకు మన దేశ మొత్తం చమురు దిగుమతుల్లో ఈ వాటా 72 శాతంగా ఉండేది.పశ్చిమ దేశాలకు మద్దతు పలుకుతున్న తమ దాయాది దేశం ఉక్రెయిన్ ఫై రష్యా దాడులు నేపథ్యంలో రష్యా పై పశ్చి మ దేశాలు ఆంక్షలు విధించడంతో తనకు మిత్రదేశం భారత్ కు సుమారు 30 శాతం తక్కువ ధరకు ముడిచమురు విక్రయించడం మొదలు పెట్టింది. దానికి పశ్చిమ దేశాలు వ్యతికరేకత ఉన్నప్పటికీ మోడీ సర్కార్ ప్యూహాత్మకంగా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో… భలే చౌక బేరం అంటూ భారత్ లో రష్యా చమురు దిగుమతులు ఊపందుకున్నాయి. .. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా .. ఇప్పు డు భారత చమురు అవసరాల్లో 36 శాతం ఒక్క రష్యా నే తీరుస్తోంది. అయితే దురదృష్టం ఏమిటంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న భారత్ లోని ఆయిల్ కంపెనీలు ఆ ప్రయోజనాలు ను, భారీ లాభాలను సామాన్య వాహనదారులకు పంచడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *