సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భవ్య భీమవరం పేరిట మౌలిక వసతులతో సుందరీకరణ పనులు శరవేగంగా చేపట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నేడు, శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ‘భవ్య భీమవరం’లో భాగంగా సుమారు 66 లక్షలతో నిర్మించిన మున్సిపల్ పార్క్ నుమంత్రి రవికుమార్, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన భీమవరం సుందరీకరణ దిశగా అడుగులు వేస్తోందని, భవ్య భీమవరం పేరిట పట్టణంలోని ముఖ్యకూడళ్లు, ప్రధాన ప్రాంతాలు, పార్కుల అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి అయ్యాయని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. భవ్య భీమవరంకు దాతలు ముందుకు వస్తున్నారని, భీమవరం రూపురేఖలు మార్చేలా చకచకా పనులు చేస్తున్నామని, దాతల సహకారంతో మూడు చోట్ల పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు,మాజీ మంత్రి పీతల సుజాత కార్పొరేషన్లు చైర్మన్లు, డైరెక్టర్లు, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ సభ్యులు, దాతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *