సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంపై 250 ఏళ్ళు పైగా పెత్తనం చేసిన బ్రిటీష్ వారికీ ప్రపంచం నివ్వెరపోయేలా తాజగా… చరిత్ర ఒక విచిత్ర సమాధానం చెబుతుంది. దానిలో భాగంగా భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాని కావడం దాదాపు ఖాయంగా భావిస్తునాన్రు. . పోటీ నుంచి తప్పు కుంటున్నట్లు మాజీప్రధాని బోరిస్ జాన్స న్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాం ట్కు కేవలం 29 మంది ఎం పీల మద్దతే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు, సోమవారంలోగ ఆమె 100 మంది సభ్యు ల మద్దతు ఉం దని నిరూపించుకోలేకపోతే.. ఇప్పటికే 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్ అతిసునాయాసంగా ప్రధాని అవుతారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్య క్తిగా సరికొత్త చరిత్ర కు స్వీకారం చుట్టనున్నారు.
