సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనేక అడ్డంకులు దాటుకొని షూటింగ్ ప్రారంభించిన 6 సంవ‌త్స‌రాల తరువాత పూర్తీ అయ్యి ఎట్ట‌కేల‌కు ‘ నవరస లోక నాయకుడు ‘ కమల్ హాసన్ నటించిన భార‌తీయుడు 2 సినిమా నేడు, ప్రేక్షకుల కోసం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. చిత్రం విడుద‌ల‌కు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నపటికీ తెలుగునాట అంతగా లేవనే చెప్పాలి. దాని ప్రభావం నేడు, ఈ సినిమా ఓపెనింగ్ లపై ఫై పడింది..భీమవరంలో మల్టి ఫ్లెక్స్, పద్మాలయ, నటరాజ్ లలో రిలీజ్ చేసారు. సో సో ఓపెనింగ్స్.. ఈ నేప‌థ్యంలో సినిమా చూశాక ప్రేక్ష‌కులు మిశ్రమంగా స్వాందిస్తున్నారు. క‌మ‌ల్ హ‌స‌న్ 100 ఏళ్ళు దాటిన వృద్దుడు గా తనదయిన శైలి లో బాగా నటించినప్పటికీ మేకప్ అతిగా అనిపించింది. అవినీతి ఫై అదే పాత తరహా సన్నివేశాలు ఉన్నపటికీ ఈ సినిమా లో సేనాపతి పాత్ర ఎందుకు అవతలి వారిని చెపుతున్నాడో గత భారతీయుడు సినిమాలో అంత కనివిన్స్ చేయలేకపోవడం పెద్ద లోపంగా చెబుతున్నారు. సిద్దార్ధ, రకుల్ బాగానే యూత్ ను ఆకట్టుకుంటారు. పాటలు మైనస్ అంటున్నారు. ఇంటర్వెల్ ముందు సాగదీతగా ఉన్నపటికీ సెకండ్ అఫ్ బాగుందని ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో అనిరుధ్ బీజీఎమ్ అదిరిపోయేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు. క్లయిమాక్స్ బాగుంది. ప్ర‌తి సీన్‌లో చాలా మంది ఆర్టిస్ట్స్‌తో క‌ల‌ర్ పుల్‌గా ఉంద‌ని, శంక‌ర్ మార్క్ విజువ‌ల్స్ ఎక్ట్రార్డిన‌రీగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి భారతీయుడు వన్ తో పోలిస్తే మాత్రం 2 వెనుకబడ్డాడని ప్రేక్షకులు టాక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *