సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). 1996లో ఘన విజయం సాధించిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతుంది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U/A’ (యూ/ఏ) సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలో కొన్ని అభ్యన్తరకర మాటలను ప్రేక్షకులకు వినపడకుండా మ్యూట్ చేయాలని మూవీ యూనిట్‌కు సూచించినట్లుగా సమాచారం.ఇక ‘భారతీయుడు 2’ రన్‌టైం ఏకంగా 3 గంటల నాలుగు నిమిషాలు వచ్చింది.ఇంటర్వెల్ తో కలపి 3- 15 నిముషాలు ఉంటుందన్నమాట. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని అంటే మాటలు కాదు. కాగా.. రన్‌టైం విషయంలో గత శంకర్ సినిమాల తరహాలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదట. కథపై శంకర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, వివేక్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
