సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యుద్ధం చేస్తున్న అమెరికా డాలర్ బాగానే ఉంది. ఇరాన్ లో క్షిపణులు కు కొరత లేదు.. కానీ అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే నేడు, సోమవారం భారతీయ రూపాయి మారకం విలువ (93.97) గతంలో ఎన్నడూ లేన్నంత దారుణంగా పడిపోయింది.. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 112.9 డాలర్లకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. దేశీయ మార్కెట్ (Indian stock market).గత సెషన్ ముగింపు (74,532)తో పోల్చుకుంటే నేడు,సోమవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరకు సెన్సెక్స్ 1836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద స్థిరపడింది. ఐటీ రంగ షేర్లు స్వల్ప లాభాలను ఆర్జించాయి.సెన్సెక్స్, నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్ స్వల్ప లాభాలు ఆర్జించాయి (share market ).. బ్యాంక్ నిఫ్టీ 1989 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2137 పాయింట్లు దిగజారింది.
