సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాక్ సరిహద్దులులో ఇరు దేశాల సైన్యాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రమూకల్ని పెంచి పోషించి, కాశ్మిర్ అభివృద్ధి శాంతిని చూడలేక అక్కడ అరాచకాలకు వత్తాసు పలుకుతూ.. సంబరపడిన దాయాది దేశం పాకిస్థాన్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంది. పొరుగు దేశంతో తన దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. భారత్ లో ఉన్న పాకిస్తానీయులు దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని తక్షణమే నిలిపివేశారు పాక్ తో అన్ని ఆర్ధిక బంధాలు తెంచుకోవడం తో .పాటు కీలకమైన సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించడంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. పాకిస్తాన్‌లోని బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ KSE100 2,000 పాయింట్లు పడిపోయింది. KSE100 2,098.10 పాయింట్లు లేదా 1.79 శాతం తగ్గి 115,128.04 వద్ద ఉంది. భారత్ నుండి సింధు నది జలాలు నిలిచిపోతే పాక్ దేశం లో ఆర్ధికంగా పూర్తిగా కుదేలు కావడంతో పాటు దేశంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
