సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అడ్జక్షుడు ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపు నిర్ణయాలతో విసిగిపోయిన భారత్ – ఐరోపా సమాఖ్య(EU) మధ్య తాజగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు సోమవారం(జనవరి 26న) ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ దేశాలు దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అని పిలుస్తున్నారని భారత్ తో ఒప్పందం కుదరదంటే పట్ల యూరోపియన్ దేశాల నేతలు( అమెరికా మినహా) మరో ప్రక్క హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై భారత్ నుండి 40 శాతం టాక్స్ లేకుండానే బట్టలు ఈయూ దేశాలకు ఎగుమతి అవుతాయి. భారత్ లో యువతకు వీసాలో కఠిన నిబంధనలు ఇకపై ఉండవు. విదేశీ ఉద్యోగాలు ఎక్కవ లభిస్తాయి. అలాగే ఈయూ దేశాల నుండి భారత్ దిగుమతి చేసుకొనే ఆధునిక కాస్ట్లీ కార్లు, మద్యం అమ్మకాలపై భారత్ లో భారీ టాక్స్ లు సుమారు 60 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది.. ఈ మేరకు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్‌(IEW)-2026ను నేడు, మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఈ ట్రేడ్‌ డీల్‌ గురించి ఆయన వివరించారు. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా భారత్ అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు..ఈ సదస్సుకు 120కి పైగా దేశాల నుంచి రికార్డు స్థాయిలో 75000 మందికిపైగా ఇంధన నిపుణులను ఇండియా ఎనర్జీ వీక్ ఆహ్వానించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *