సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలలో యుద్ధం నేపథ్యంలో గత మూడు రోజులుగా భారీ స్థాయి నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు, గురువారం కోలుకున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌ కాస్త వెనక్కి తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం.. అలాగే భారత్.. ఇరాన్ దేశాధినేత సుప్రీం ఖమైని మృతికి కాస్త ఆలస్యంగానైనా నేడు, గురువారం సంతాపం తెలియజేసియడం, మరో ప్రక్క ఇటీవల అమెరికా తో ట్రేడ్ డీల్ కోసం రష్యా తో క్రూడ్ ఆయిల్ కొనుగోలు భారీగా తగ్గించినప్పటికీ రష్యా స్వయంగా భారత్ కు కావలసినంత క్రూడ్ ఆయిల్ పంపుతామని ప్రకటించడంతో సూచీలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. గత సెషన్ ముగింపు (79,116)తో పోల్చుకుంటే నేటి గురువారం ఉదయం 400 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ఒక దశలో దాదాపు 1200 పాయింట్లు లాభపడి 80,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 811 పాయింట్ల లాభంతో 79,927 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 285 పాయింట్ల లాభం తో 24,765 వద్ద స్థిరపడింది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 867 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *