సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భారత్ లో ఇప్పటికే పెట్రోల్ రేటు లీటర్ కు వచ్చి 110 రూపాయలు ఫై మాటే.. అయితే గత 3 ఏళ్ళు గా రష్యా నుండి భారీ సబ్సిడీ కి కొనుగోలు చేయ్యడం వల్ల లక్షల కోట్ల ఆదా అవుతున్న ఇక్కడ పెట్రోల్ రేటు లీటర్ కు వచ్చి 60 రూపాయలు వచ్చిందా? అంటే అది లేదు. దేశంలో అన్నింటిపై GST ఉంది కానీ పెట్రోల్ ఫై మాత్రం ఉండదు.. GST ఉంటె ప్రజలకు సబ్సిడీ రేటుకే పెట్రోల్ డీజిల్ అందుతుంది. మరి లాభాలు మాత్రం ప్రజలకు పంచడం లేదు. కానీ రష్యా నుండి భారత్ ఆయిల్ కొనుగోళ్లపై మండి పడుతున్న అమెరికా విధిస్తున్న ఆంక్షలు కు మాత్రం భారత్ లో సాధారణ ప్రజలు అమెరికా ప్రవాస భారతీయులు ప్రత్యక్షంగా ఇబ్బందులు పాలు అవుతున్నారు. ఇదిలా ఉండగా మన దేశంలోని రిఫైనరీలు (పెట్రోలు, డీజిల్ తయారీ కేంద్రాలు) రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. తాజా రికార్డ్స్ ల ప్రకారం, ఇతర దేశాల నుండి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేస్తోంది. కానీ, ప్రస్తుతం రష్యానే భారత్‌కు ముడి చమురు సరఫరా చేసే అతి పెద్ద దేశం రష్యా అని తాజా నివేదికలు చెబుతున్నాయి.2025 సెప్టెంబర్‌లో భారత్‌ దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో 34 శాతం రష్యా నుంచే వచ్చింది. మరి దీని లాభ ఫలాలు భారతీయులు అందరికి ఎప్పటికి అందుతాయో ?మోడీ సర్కార్ ప్రజలకు వివరణ ఇస్తే బాగుంటుంది… సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *