సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా అందిన సమాచారం ప్రకారం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు.. ఈ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్రయాణంలో తిరుమల, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి శ్రీశైలం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను దర్శించవచ్చు. .ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస్సు సౌకర్యం, హోటల్ వసతి, భోజనం, గైడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యాత్ర 2026 ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, లఖ్‌నవూ, కాన్పుర్ వంటి పలు నగరాల నుంచి ప్రయాణికులు ఈ టూర్‌లో చేరవచ్చు. ఈ టూర్ ముఖ్యంగా కుటుంబాలు, వృద్ధులు, గ్రూప్‌గా ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో కంఫర్ట్ (2AC) కేటగిరీకి వ్యక్తికి రూ. 56,710 వసూలు చేస్తారు. స్టాండర్డ్ (3AC) కేటగిరీకి ఒక్కొక్కరికి రూ. 42,530 కాగా, ఎకానమీ (స్లీపర్) కేటగిరీకి ఒక్కొక్కరికి రూ. 24,790గా నిర్ణయించారు. IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *