సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ ప్రధాని మోడీ,గల్ఫ్ లో జరుగుతున్నా విద్వంసానికి జరుగుతున్నా ‘ఆకస్మిక పరిణామాల’కు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో ఖలిస్థాన్ ఉద్యమ నేతలకు కెనడాలో మద్దతు ఇస్తున్నట్లు? అనుమానాలు నేపథ్యంలో.. గతానికి ఇప్పటికి భారత్ పట్ల కెనడా వైఖరి మారింది. నేడు, సోమవారం భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేతో కలిసి ప్రధాని మోడీ మీడియా సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో భారతీయులు ఎక్కడున్నా వారితో ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ మనకే కాక ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నట్టు చెప్పారు. దీనిపై సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, కెనడా ప్రధాని మార్క్‌తో విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో చేరాలని కూడా కెనడా నిర్ణయం తీసుకుంది. అలాగే అత్యంత కీలకమైన యురేనియం ను భారత్ కు అందించడానికి కెనడా అంగీకరించినట్లు ? భావిస్తున్నారు
