సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిండెంట్ డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్ పాకిస్తాన్ యుద్ధంపై మాట్లాడుతూ.. ‘యుద్ధాలు ఆపటంలో మేము విజయం సాధిస్తున్నాము. ఇజ్రాయిల్ , హమాస్, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య బీకర యుద్ధం అలాగే అణుయుద్ధానికి సిద్ధం అయిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపాను. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగి ఉంటే.. అది మరో వారానికి న్యూక్లియర్ యుద్ధంగా మారేది. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉండింది. పాకిస్తాన్, ఇండియాపై న్యూక్లియర్ బాంబు వేసేది. అయితే అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. యుద్ధం అలాగే కొనసాగి ఉంటే పాకిస్తాన్ సర్వనాశనం అయ్యేది.నేను ఇండియా, పాకిస్తాన్‌ ప్రధానులతో మాట్లాడాను. వారు గొప్ప లీడర్లు. అయినా కూడా న్యూక్లియర్ యుద్ధం వైపు మొగ్గు చూపారు. అమెరికా తో వ్యాపారం పేరు చెప్పి రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేశాము. యుద్ధం ఆపేంత వరకు వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకునేది లేదని చెప్పాము. ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యని పని నేను చేశాను.అని ట్రంప్ తన ఘనత చాటుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *