సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపరేషన్ సిందూర్” పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. ఆపరేషన్ సిందూర్” ఒక దెబ్బకు మూడు పిట్టలు అనేలా.. రాత్రిరాత్రికే మూడు టెర్రర్ హెడ్‌క్వార్టర్స్ నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ..దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.మర్కజ్ సుభాన్ అల్లా పేరుతో పిలవబడే జైష్ ఎ మొహమ్మద్ ప్రధాన స్థావరం పాకిస్తా్‌న్‌లోని పంజాబ్ జిల్లా బహవల్పూర్‌లో ఉంది. 2019 పుల్వామా ఉగ్రదాకి పాల్పడిన నిందితులకు ఈ శిబిరంలోనే శిక్షణ ఇచ్చారు. మర్కజ్ జైష్ ఎ మొహమ్మద్ స్థావరంలో జైషే మమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, జైష్ ఎ మహ్మద్ అధిపతి ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమ్మర్ కుటుంబసభ్యుల నివాసాలు కూడా ఉన్నాయి. యూకే సహా కొన్ని గల్ఫ్, ఆఫ్రికన్ దేశాల నుంచి సేకరించిన నిధులతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ జైష్ ఎ మహ్మద్ సభ్యులకు ఇక్కడ 2018 జులై నుంచిశిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
